Breaking News

ఐఫోన్‌ 16పై రూ.37,900 డిస్కౌంట్‌! ఎలాగంటే..

Published on Sun, 09/22/2024 - 09:05

ఐఫోన్‌ 16 (iPhone 16) సిరీస్‌  అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్‌ లైనప్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ పొందే మార్గం ఉంది. అదే యాపిల్‌ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.

అసలేంటి యాపిల్‌ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్‌లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్‌ పొందడం అన్నమాట. కస్టమర్‌లు తమ పాత ఐఫోన్‌లను ఇచ్చి కొత్త ఐఫోన్‌ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్‌ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.

ఐఫోన్‌ 16 బేస్ 128జీబీ మోడల్‌ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్‌ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్, యాపిల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్‌లను కూడా ఈ ట్రేడ్-ఇన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు.

ఏ మోడల్‌తో ఎంత?
మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్‌లో ఐఫోన్‌ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇక ఐఫోన్‌ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్‌ 13 ఉంటే యాపిల్‌ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్‌ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)