Breaking News

భారత్‌లో ఫాక్స్‌కాన్‌.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్‌ సిగ్నల్‌

Published on Tue, 08/01/2023 - 08:08

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు ఐఫోన్‌లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ సంస్థ భారత్‌ రెండు మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. 

ఫాక్స్‌కాన్‌ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్‌ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్‌కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది.  అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్‌కాన్‌ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్‌ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్‌ కాన్‌ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.  

చైనా కంటే భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. 

కాగా, ఫాక్స్‌ కాన్‌ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్‌కాన్‌, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్‌లో ఫాక్స్‌కాన్‌ 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)