Breaking News

ఇండియన్‌ ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త!

Published on Tue, 08/23/2022 - 18:34

ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త. భారత్‌ కేంద్రంగా ఐఫోన్‌ -14 ఫోన్‌లను తయారీ చేయాలని యాపిల్‌ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు నివేదికల ప్రకారం..వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి భారత్‌లో 'మేడిన్‌ ఇండియా ఫోన్‌ల' ఉత్పత్తిని ప్రారంభించనుంది. 

జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల దేశాల మధ్య ఏర్పడ్డ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో యాపిల్‌ సంస్థ భారత్‌లోనూ ఐఫోన్‌లను తయారు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి మన దేశంలో చెన్నై కేంద్రంగా యాపిల్‌ సంస్థ ఐఫోన్‌లను తయారు చేయిస్తుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం లేదు.

మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లో విడుదల కానున్న ఐఫోన్‌-14సైతం విదేశాల్లో తయారీ చేసి.. అక్కడి నుంచి మనదేశానికి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతి సమయం 6 నెలల నుంచి 9నెలల వరకు పట్టేది.  తైవాన్ అంశంపై అమెరికా, చైనా మ‌ధ్య విభేదాలు, భార‌త్‌తో చైనా స‌రిహద్దు వివాదం నేప‌థ్యంలో రానున్న రోజుల్లో  ఐఫోన్‌లను ఆవిష్కరించి.. కొనుగోలు దారులకు చేరేందుకు మరింత సమయం పట్టనుంది. 

ఆ సమయాన్ని తగ్గిస్తూ భారత్‌లో ఐఫోన్‌-14ను తయారు చేయాలని చూస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకోసం చెన్నై ఫ్లాంట్‌లో ఐఫోన్‌ -14 ల తయారీపై యాపిల్‌తో పాటు ఫాక్స్‌ కాన్‌ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐఫోన్‌-14తోపాటు దేశీయంగా తయారయ్యే ఇతర ఐఫోన్‌ ధరలు భారీగా తగ్గనున్నాయి.కాగా ఐఫోన్‌-14 మేడిన్‌ ఇండియాపై యాపిల్‌ సంస్థ స్పందించాల్సి ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

చదవండి👉 యాపిల్‌ భారీ షాక్‌, ఉద్యోగులపై వేటు!

Videos

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

Photos

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)