Breaking News

యాపిల్‌కు లక్ష ఫైన్.. కస్టమర్ దెబ్బ అదుర్స్‌..

Published on Sat, 09/30/2023 - 19:32

కొన్ని సార్లు కంపెనీలు లేదా కంపెనీ నిర్వహణ సంస్థలు చేసే తప్పిదాలు కస్టమర్లకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో వినియోగదారుడు నష్టపరిహారం పొందుతాడు. ఇలాంటి సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ నివాసి 'అవెజ్ ఖాన్' ఆపిల్ ఇండియా సర్వీస్ సెంటర్ నుంచి లక్ష రూపాయల నష్టపరిహారాన్ని పొందినట్లు తెలుస్తోంది. అతని ఐఫోన్ 13 మొబైల్‌కి జరిగిన నష్టం కారణంగా ఈ పరిహారం వచ్చింది.

2021 అక్టోబర్ నెలలో ఐఫోన్ 13 మొబైల్‌ను ఒక సంవత్సరం వారంటీతో కొనుగోలు చేసాడు. ఆ తరువాత కొన్ని నెలలకు బ్యాటరీ, స్పీకర్ రెండింటిలోనూ సమస్య ఏర్పడింది. దీంతో 2022 ఆగస్టులో ఇందిరానగర్ సర్వీస్ సెంటర్‌ సందర్శించి సమస్య తెలిపాడు. అక్కడి వారు ప్రాబ్లమ్ త్వరలోనే పరిష్కారమవుతుందని, వారం రోజుల్లో మీకు ఫోన్ చేస్తామని తెలిపారు.

కొన్ని రోజుల తరువాత మొబైల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిందని సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తరువాత కూడా అదే సమస్య ఉన్నట్లు మళ్ళీ సర్వీస్ సెంటర్‌లో ఫిర్యాదు చేశాడు. మళ్ళీ ఈ సమస్య క్లియర్ చేస్తామని చెప్పిన సర్వీస్ సెంటర్‌ రెండు వారాలైనా స్పందించలేదు.

మొబైల్ మెష్‌పై జిగురు లాంటి పదార్ధం కనిపించినట్లు తెలిపారు. ఈ సమస్య ఒక సంవత్సరం వారంటీ కింద కవర్ చేయరని తెలిపారు. దీంతో ఖాన్.. ఆపిల్ ప్రతినిధులకు చాలా ఇమెయిల్‌లు పంపించాడు, కానీ దానికి ఎలాంటి రిప్లై రాలేదు. విసిగిపోయిన కస్టమర్ లీగల్ నోటీసు పంపాడు, దానికి కూడా ఎటువంటి సమాధానం రాలేదు.

ఇదీ చదవండి: రతన్ టాటా జీవితంలో ఈ ప్రత్యేక వ్యక్తి గురించి తెలుసా? కంపెనీని నడిపించడమే కాదు..

గత డిసెంబర్ నెలలో స్థానిక జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుని విచారించిన కమిషన్ అతనికి వడ్డీతో కలిపి రూ. 79,900 నష్టపరిహారం, అతడు పడిన కష్టానికి అదనంగా రూ. 20,000 చెల్లించాలని యాపిల్ కంపెనీని ఆదేశించినట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)