Breaking News

సూపర్‌, మైండ్‌ బ్లోయింగ్‌.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్‌ కుక్‌, ఇది అసలు ఊహించలేదు!

Published on Sat, 06/03/2023 - 13:15

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రపంచ దేశాల రిటైల్‌ మార్కెట్‌పై దృష్టిసారించింది. ప్రస్తుతం, దేశీయంగా జరుగుతున్న ఊహించని బిజినెస్‌తో భారత్‌లో మరో మూడు స్టోర్లతో పాటు చైనా, ఆసియా, అమెరికా, యూరప్‌ దేశాలలో రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. 

అయితే, తాజాగా యాపిల్‌ కీలక నిర్ణయానికి కారణం భారత్‌ మార్కెటేనని సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ 26 దేశాల్లో 520 స్టోర్‌ల నుంచి ఉత్పత్తుల్ని విక్రయించింది. రానున్న రోజుల్లో మరో 53 రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించేలా భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌లు దారి చూపినట్లు టెక్‌ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

  

కుపెర్టినో దిగ్గజం ఈ ఏడాది భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో యాపిల్‌ రీటైల్‌ స్టోర్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి సీఈవో టిమ్‌కుక్‌ హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ రెండు స్టోర్‌లలోని యాపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఈ రెండు స్టోర్‌లలోని నెలవారీ విక్రయాలు రూ. 22 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ సంతోషం వ్యక్తం చేశారని, అందుకే 2027 నాటికల్లా ఆసియా - పసిపిక్‌ రీజియన్లలో 15 స్టోర్లు, యూరప్‌ - మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఐదు స్టోర్లు, అమెరికా - కెనడాలలో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక హైలెట్‌ చేసింది. 

దీంతో పాటు ఇప్పటికే కార్యకాలపాలు కొనసాగుతున్న ఆసియా దేశాల్లో ఆరు స్టోర్లు, యూరప్‌లో తొమ్మిది స్టోర్లు, నార్త్‌ అమెరికాలో ఉన్న 13 స్టోర్లను మరో ప్రాంతానికి మార్చేలా టిమ్‌ కుక్‌ సంబంధిత విభాగాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. 

ముఖ్యంగా..అమెరికా, యూరప్‌ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో 2027 నాటికల్లా యాపిల్‌ స్టోర్ల పునరుద్దరణ, విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2025 నాటికి ముంబైలోని సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతంలో మూడో యాపిల్‌ స్టోర్‌ను, 2026 నాటికి ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ ప్రోమెనేడ్‌ మాల్‌లో ఐదో స్టోర్‌ను, 2027 నాటికి ముంబైలోని వ్రోలి ప్రాంతంలో ఇలా మరో మూడు స్టోర్‌లను యాపిల్‌ ప్రారంభించనుంది.

 చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)