Breaking News

పేరు మారనున్న ఐఫోన్‌?

Published on Fri, 01/03/2025 - 19:16

యాపిల్‌ (Apple) తదుపరి తరం ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE)ని 2025 మార్చిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కాస్త బడ్జెట్ ధరలో లభించే ఈ మోడల్‌ను రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్‌ ఎస్‌ఈ4 (iPhone SE4)కి ఐఫోన్‌ 16ఈ (iPhone 16E) అని పేరు మార్చవచ్చు.

ఐఫోన్‌ 16ఈ అంచనా స్పెక్స్
» ఐఫోన్‌ 16ఈ బేస్ ఐఫోన్‌ 14కి సారూప్యమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని పుకారు ఉంది. ఆశిస్తున్న ఫీచర్లలో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, USB-C పోర్ట్ ఉన్నాయి.

» ఐఫోన్‌ 16ఈకి కొత్త ఏ-సిరీస్ చిప్ రానుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే 48-మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

» ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో ప్రారంభించిన యాక్షన్ బటన్‌ ఫీచర్ ఐఫోన్ 16ఈలో కూడా ఉంటుందా అనేది అస్పష్టంగానే ఉంది.

» ధరల విషయానికొస్తే.. ఐఫోన్‌ ఎస్‌ఈ3తో పోలిస్తే ఐఫోన్‌ 16ఈ ధర  స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో దీని ధర దాదాపు రూ. 50,000గా ఉండవచ్చు.

ఇన్-హౌస్ 5G మోడెమ్ 
ఐఫోన్‌ 16ఈ ప్రధాన హైలైట్ యాపిల్‌ తొలి అంతర్గత 5G మోడెమ్. ఈ అప్‌డేట్‌ బాహ్య సప్లయిర్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని హార్డ్‌వేర్‌లో ఏకీకరణను మెరుగుపరచడానికి ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు.

బడ్జెట్ లైన్‌ను రీబ్రాండింగ్ చేయడం, ఆధునీకరించడం ద్వారా చైనా వంటి మార్కెట్‌లలో తిరిగి ఆదరణ పొందాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ యాపిల్‌.. హువాయ్‌, షావోమీ వంటి బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి