Breaking News

భారత్‌లో యాపిల్‌ మేనియా... 

Published on Sat, 09/20/2025 - 05:05

న్యూఢిల్లీ: భారత్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చిన యాపిల్‌ ఐఫోన్‌ 17 అభిమానుల్లో మేనియా సృష్టించింది. లేటెస్ట్‌ ఫోన్‌ను ముందుగా దక్కించుకునేందుకు యాపిల్‌ స్టోర్స్‌ ముందు ఫ్యాన్స్‌ బారులు తీరారు. కొందరు ముందు రోజు రాత్రి నుంచే దాదాపు 21 గంటల పాటు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో చాంతాడంత క్యూలు కనిపించాయి. ఐఫోన్‌ 17ని  మొదటి రోజునే ముందుగా దక్కించుకున్నవారు మిగతా వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రికార్డు స్థాయిలో కొనుగోలుదారులు వెల్లువెత్తినట్లు రిటైలర్లు తెలిపారు. 

‘నేను పొద్దుటి నుంచే క్యూలో ఉన్నాను. ఈ రంగు ఐఫోన్‌ను కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది‘ అంటూ ఢిల్లీలోని అష్రఫ్‌ అనే కొనుగోలుదారు తెలిపారు. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన యాపిల్‌ హెబ్బాల్‌ స్టోర్‌లో కూడా ఇలాంటి సందడే నెలకొంది. అటు ముంబైలోని స్టోర్‌ దగ్గర గుమికూడిన కస్టమర్ల మధ్య ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో గొడవ తలెత్తడంతో, సెక్యూరిటీ సిబ్బంది పరిష్కరించాల్సి వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్‌ 17 సిరీస్‌ ధర శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)