Breaking News

యాపిల్‌కు ఓపెన్‌ఏఐ బోర్డులో స్థానం..!

Published on Wed, 07/03/2024 - 13:42

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఓపెన్‌ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. యాపిల్‌ తన ఉత్పత్తుల్లో ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్‌ ఓపెన్‌ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు యాప్‌స్టోర్‌కు సారథ్యం వహిస్తున్న ఫిల్‌ షిల్లర్‌ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్‌ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్‌ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్‌ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్‌కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్‌ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.

ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!

జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2024లో భాగంగా యాపిల్‌-ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్‌ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్‌ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్‌ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని యాపిల్‌ పేర్కొంది. జనరేటివ్‌ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్‌ మెటా, గూగుల్‌తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)