Breaking News

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా! టెక్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌!

Published on Fri, 05/06/2022 - 12:39

టెక్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఆన్‌ లైన్‌లో  షాపింగ్‌ కోసం ఒక్కోసారి గుర్తు తెలియని వెబ్‌ సైట్‌లు,యాప్స్‌లలో లాగిన్‌ అవ్వాల్సి వస్తుంది. అదే సమయంలో సైబర్‌ నేరస్తులు పాస్‌వర్డ్‌ల సాయంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లాంటి సంఘటనల్ని మనం చూసే ఉంటాం. అయితే ఇకపై వాటికి చెక్‌ పెట్టేలా దిగ్గజ సంస్థలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి.

 

వరల్డ్‌ పాస్‌వర్డ్‌ డే సందర్భంగా యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఎఫ్‌ఐడీఓ (ఫాస్ట్‌ ఐడెంటిఫై ఆన్‌లైన్‌) అలయన్స్‌ సంస్థ, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కన్సార్టియం(డ్ల్యూ3సీ) భాగస్వామ్యంతో పైన పేర్కొన్న మూడు దిగ్గజ సంస్థలు పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్‌ అయ్యేలా అప్లికేషన్‌లను డెవలప్‌ చేయనున్నాయి.

ఎలా అంటే 
సాధారణంగా స్మార్ట్‌ ఫోన్‌తో మనం గూగుల్‌పే యూపీఐ పేమెంట్స్‌ స్కానింగ్‌తో, యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌లో ఫేస్‌ ఐడీ వెరిఫికేషన్‌ను వినియోగిస్తుంటాం. సేమ్‌ ఇలాగే యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ డెవలప్‌ చేస్తున్న కొత్త టెక్నాలజీతో పాస్‌వర్డ్‌ లేకుండా వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అవ్వొచ్చని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్‌ అవ్వడం సాధ్యమేనా?
పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్‌ అవ్వడం సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. భవిష్యత్‌లో బయోమెట్రిక్‌ సాయంతో పాస్‌వర్డ్‌ లేకుండా వెబ్‌సైట్‌లు, యాప్స్‌లో లాగిన్‌ అవ్వొచ్చని అంటున్నారు. ప్రస్తుతం యూజర్లు టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ విషయంలో యూజర్లు పడుతున్న ఇబ్బందులు తొలగిపోన్నాయి. సైబర్‌ నేరస్తులకు చుక్కలు కనిపించనున్నాయి.  

చదవండి👉'వన్‌ రింగ్‌ స్కామ్‌'..మిస్డ్‌ కాల్‌ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)