Breaking News

యాపిల్‌ సంస్థ గుడ్‌ న్యూస్‌.. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్‌, ధర తగ్గునుందా!

Published on Mon, 09/26/2022 - 13:42

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్లకు విపరీతంగా డిమాండ్‌ ఉంది. ప్రత్యేకంగా యూత్‌లో ఇఫోన్‌కి ఉన్న క్రేజ్‌ వేరే. అందులోని ఆపరేటింట్‌ సిస్టం, సెక్యూరిటీ సర్వీసెస్‌, ఫీచర్స్‌ కస్టమర్లను కట్టిపడేశాయి. అందుకే భారీగా ధర ఉన్నప్పటికీ డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఫోన్‌ కంపెనీ యాపిల్‌ సంస్థ తాజాగా భారత్‌లో ఐఫోన్‌ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.

తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌ కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ సంస్థతో కలిసి యాపిల్‌ ఈ ఐఫోన్లు ఉత్పత్తి చేపడుతోంది. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మాత్రమే కాదు ప్రధాన ఐఫోన్ అసెంబ్లర్ కూడా. అతి త్వరలో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 ఇండియన్‌ మార్కెట్లోకి రాబోతోంది. త్వరలోనే వీటిని మార్కెటలోకి అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది. అయితే దేశీయంగా ఐఫోన్లు తయారీ అవుతున్నాయి కాబట్టి వీటి ధర తగ్గే అవకాశలు ఉండచ్చని ఐఫోన్‌ ప్రియులు భావిస్తున్నారు.

యాపిల్‌ తన 2022 ఐఫోన్‌ లైనప్‌ను సెప్టెంబర్ 7న ‘ఫార్ అవుట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max తో పాటు సరికొత్త iPhone 14 Plus ఉన్నాయి. ఈ సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్లతో రాబోతోంది. ఇందులో మెరుగైన కెమెరా, పవర్‌ఫుల్‌ సెన్సార్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్‌(SOS) టెక్స్ట్‌లను పంపడానికి శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్‌తో వస్తుంది. భారతదేశంలో ఐఫోన్ 14ను తయారు చేస్తున్నందును సంతోషిస్తున్నామని. కొత్త ఐఫోన్‌ లైనప్ అధునాతన టెక్నాలజీతో పాటు ముఖ్యమైన భద్రతా సామర్థ్యాలు కూడా ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)