Breaking News

ఈ ఐఫోన్‌ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్‌!

Published on Sat, 11/02/2024 - 16:59

ఐఫోన్‌ 14 ప్లస్‌ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్‌ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్‌ 14 ప్లస్ యూనిట్‌లలో తలెత్తిన రియర్‌ కెమెరా సమస్య కోసం యాపిల్‌ ప్రత్యేక సర్వీస్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్‌ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.

రియర్‌ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్‌లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా  ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్‌ 14 ప్లస్‌లో రియర్‌ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు 
చెల్లించినవారు  ఆ మొత్తాన్ని రీఫండ్‌ పొందవచ్చు.

సమస్య ఇదే..
ఐఫోన్‌ 14 ప్లస్‌లో రియర్‌ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్‌ ప్రత్యేక  సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్‌ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్‌ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్‌లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్‌ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 28 మధ్య తయారైనవి.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్‌.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!

అయితే తమ ఫోన్‌లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్‌ ప్రోగ్రామ్‌ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్‌ ఏర్పాటు చేసిన సపోర్ట్‌ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్‌ నంబర్‌ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్‌ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్‌ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)