Breaking News

యాపిల్‌ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా

Published on Sat, 01/04/2025 - 18:05

ప్రపంచ నం.1 సంస్థ యాపిల్‌(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్‌ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.

‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్‌ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.

ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!

అసలేం జరిగిందంటే..

2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్‌ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)