Breaking News

యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్‌లో కొత్త ఫీచర్లు

Published on Thu, 11/20/2025 - 09:07

ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్‌ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌ని అపరిమిత స్థాయిలో రిపేర్‌ చేయించుకునేందుకు ప్రొటెక్షన్‌ ప్లాన్‌ కింద కవరేజీ ఉంటోంది.

యాపిల్‌కేర్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్‌ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్‌ కొనుక్కున్నప్పుడే ప్లాన్‌ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది.  

కొత్త ఫీచర్లు

  • ఐఫోన్‌ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.

  • ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.

  • ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.

  • ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

  • నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.

  • డివైజ్‌ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్ తీసుకోవచ్చు

గమనించాల్సిన అంశాలు

  • థెఫ్ట్‌ & లాస్‌ కవరేజీ కేవలం ఐఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

  • సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది.  (యాపిల్‌ సాధారణంగా రీప్లేస్‌మెంట్‌ ఫీజు వసూలు చేస్తుంది).

  • ప్లాన్‌ ధర డివైజ్‌ మోడల్‌ ఆధారంగా మారుతుంది.
     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)