Breaking News

ఐదేళ్లలో 10 కోట్ల కస్టమర్లు.. అపోలో ఫార్మసీ లక్ష్యం

Published on Sun, 11/30/2025 - 07:37

వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్ల స్థాయికి చేరుకోవాలని అపోలో ఫార్మసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు రెండు కొత్త స్టోర్స్‌ ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మొత్తం 7,000 స్టోర్స్‌ మైలురాయిని చేరిన సందర్భంగా సంస్థ సీఈవో పి. జయకుమార్‌ ఈ విషయాలు వెల్లడించారు.

‘ప్రతి రోజూ రెండు కొత్త స్టోర్స్‌ని ప్రారంభించడాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చేరువవుతాం. తద్వారా అత్యంత నాణ్యమైన ఔషధాలను అందరికి అందుబాటులోకి తెస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. అపోలో ఫార్మసీని అపోలో హెల్త్‌కో నిర్వహిస్తోంది. తమ పెయిడ్‌ హెల్త్‌కేర్‌ లాయల్టీ ప్రోగ్రాం అయిన అపోలో సర్కిల్‌ సభ్యుల సంఖ్య 1 కోటి దాటిందని కంపెనీ వెల్లడించింది.

మరోవైపు, 7 వేల స్టోర్స్‌ మైలురాయిని చేరడమనేది అసంఖ్యాక కుటుంబాలకు తమపై గల నమ్మకానికి నిదర్శనమని అపోలో హెల్త్‌కో ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని తెలిపారు. అపోలో ఫార్మసీ ప్రస్తుతం 19,000పైగా పిన్‌కోడ్స్‌వ్యాప్తంగా రోజుకు పది లక్షల ఆర్డర్లు ప్రాసెస్‌ చేస్తోందని వివరించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)