Breaking News

అపోలో ఫార్మసీ వ్యాపారంలో విభజన

Published on Tue, 07/01/2025 - 16:38

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమ్నీచానల్‌ ఫార్మసీ, డిజిటల్‌ హెల్త్‌ వ్యాపారాలను విడదీసి, లిస్ట్‌ చేసే ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఏహెచ్‌ఈఎల్‌) బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన స్కీము ప్రకారం లిస్టింగ్‌కు 18–21 నెలల వ్యవధి పట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఆమ్నీచానల్‌ ఫార్మా, డిజిటల్‌ హెల్త్‌ వ్యాపారాన్ని కొత్త సంస్థగా విడగొడతారు. తర్వాత హెల్త్‌కేర్‌ విభాగం అపోలో హెల్త్‌కో (ఏహెచ్‌ఎల్‌), హోల్‌సేల్‌ ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌ కీమెడ్‌ను కొత్త సంస్థలో విలీనం చేస్తారు. 

ఈ ప్రక్రియతో దేశీయంగా దిగ్గజ ఆమ్నీచానల్‌ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫాం ఏర్పడుతుందని అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని పేర్కొంది. స్కీము ప్రకారం కొత్త సంస్థ, స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌కు దరఖాస్తు చేసుకుంటుంది. ఏహెచ్‌ఈల్‌ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు గాను కొత్త కంపెనీకి చెందిన 195.2 షేర్లు లభిస్తాయి. అత్యంత నాణ్యమైన హెల్త్‌కేర్‌ సేవలను కోట్ల మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మోడల్‌ ఉపయోగపడుతుందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)