Breaking News

ఈ ఏడాది మరో 5 జినోమిక్స్‌

Published on Wed, 09/24/2025 - 08:53

హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ దిగ్గజం అపోలో హాస్పిటల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరో 5 జినోమిక్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా తూర్పు, ఉత్తర, మధ్య భారతంలోని టైర్‌–2, 3 పట్టణాలలో వీటికి తెరతీయనున్నట్లు వెల్లడించింది. తద్వారా జినోమిక్స్‌ను ప్రధాన క్లినికల్‌ కేర్‌తో సమ్మిళితం చేయనున్నట్లు తెలియజేసింది. రానున్న మార్చి31లోగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఒడిషాలోని భువనేశ్వర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోతోపాటు అస్సామ్‌లోని గౌహతిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్, సీనియర్‌ కన్సల్టెంట్‌ పిడియాట్రిక్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అనుపమ్‌ సిబాల్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశీయంగా 12 అపోలో జినోమిక్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో హైదరాబాద్‌సహా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ వ్యాధులు, వీటి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జినోమిక్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సమీకృత జినోమిక్‌ సర్వీసులను సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. తద్వారా వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం, రోగుల వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలో భద్రత, మార్గదర్శకత్వం తదితరాలను అందిస్తున్నట్లు వివరించారు. 

పునరుత్పత్తి సంబంధిత జినోమిక్స్, అంకాలజీ, అరుదైన జెనెటిక్‌ వ్యాధులలో జినోమిక్స్‌ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు అనుపమ్‌ పేర్కొన్నారు. రోగులకు జెనెటిక్‌ టెస్టింగ్, కౌన్సిలింగ్, వ్యక్తిగత చికిత్స తదితరాలలో సమీకృత సేవలు సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. అపోలో జినోమిక్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ 11,000 జినోమిక్‌ కన్సల్టేషన్స్‌ మైలురాయిని చేరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్‌బీఐ అంచనా

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)