Breaking News

భారీగా పెరిగిన అపార్ట్‌మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..

Published on Fri, 12/22/2023 - 16:41

ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్‌మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది.

గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది.

వచ్చే ఏడాదికి అపార్ట్‌మెంట్‌ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. ఇవే!

అపార్ట్‌మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్‌ఎల్‌ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)