నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్

Published on Sat, 08/31/2024 - 16:23

జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్‌గా ఎదిగాను. యుఎస్‌లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.

2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్‌ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ

ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)