Breaking News

ఆంథ్రోపిక్‌.. అదిరే

Published on Fri, 11/20/2026 - 03:32

న్యూఢిల్లీ: ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోతో సంచలనం సృష్టించిన ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్‌.. లిస్టింగ్‌లో అదరగొట్టింది.  ఇష్యూ ధర 83 డాలర్లతో పోలిస్తే ఏకంగా 34 శాతం దూసుకెళ్లి 111.50 డాలర్ల వద్ద అమెరికా నాస్డాక్‌లో లిస్టయ్యింది. తద్వారా ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల వేల్యుయేషన్‌ను సాధించింది. 

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ 81.3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించి, చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోగా నిలి్చంది. ఇప్పటివరకు స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన 75 బిలియన్‌ డాలర్ల ఐపీవోనే అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఉండగా ఆంథ్రోపిక్‌ దాన్ని అధిగమించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా మరో 26 బిలియన్‌ డాలర్లు సమీకరించనుంది. ఎన్‌విడియా, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ తదితర దిగ్గజాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి.  

ఇష్యూలో భాగంగా ఆంథ్రోపిక్‌ 98 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసింది. ఇందులో 95.63 కోట్ల షేర్లను ఆంథ్రోపిక్, మిగతా వాటిని ఇతర షేర్‌హోల్డర్లు విక్రయించారు. ఒక్కో షేరుకు 83 డాలర్ల ధరని కంపెనీ నిర్ణయించింది. ఆంథ్రోపిక్‌ షేరుకు ఏఎన్‌టీ టికర్‌ సింబల్‌ను కేటాయించారు. ఆంథ్రోపిక్‌ షేరుకు బ్రోకరేజీ సంస్థలు ఔట్‌పర్ఫార్మింగ్‌ రేటింగ్‌ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో 125 డాలర్లకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నాయి. 

రాబోయే రోజుల్లో ఏఐ కంపెనీల వేల్యుయేషన్‌లు పైకి కిందికి వెళ్లినప్పటికీ, వృద్ధికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బోస్టన్‌ కన్సలి్టంగ్‌ గ్రూప్‌ గ్లోబల్‌ చెయిర్‌ రిచ్‌ లెస్సర్‌ చెప్పారు. ఎన్‌విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా, ఏఐపై వ్యతిరేకత పెరుగుతుండటం, కృత్రిమ మేధ కట్టడికి అమెరికాలో ప్రయత్నాలు జరుగుతుండటం తదితర ప్రతికూల పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ ఐపీవో విషయంలో ఆంథ్రోపిక్‌ ముందుకెళ్లడం గమనార్హం. పోటీ సంస్థ ఓపెన్‌ఏఐ ప్రస్తుతానికి పబ్లిక్‌ ఇష్యూ యోచనలో లేదు.  

ఐదేళ్ల వ్యవధిలోనే.. 
మాజీ ఓపెన్‌ఏఐ ఉద్యోగులైన డేరియస్‌ ఎమొడై, డేనియేలా, టామ్‌ బ్రౌన్‌ తదితరులు 2021లో ఆంథ్రోపిక్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రెండు సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కంప్యూటింగ్‌ పవర్, మౌలిక సదుపాయాలపై 900 బిలియన్‌ డాలర్లకు పైగా వెచి్చంచే దిశగా కంపెనీ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. వచ్చే 12 నెలల్లో దాదాపు 70 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. కంపెనీకి ఇంకా లాభాల్లోకి మళ్లాల్సి ఉండగా, ఇప్పటికే బోలెడు రుణభారం కూడా ఉంది.    

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)