Breaking News

త్వరలో కొత్త టోల్‌ పాసులు.. హైవేలపై నో టెన్షన్‌!

Published on Wed, 02/05/2025 - 21:56

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త  చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికే జీవిత కాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బేస్‌ టోల్‌ రేటును కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది.

ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉంది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వస్తుంది.

కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం రూ. 3 వేలు మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్‌ గేట్‌నైనా ఈ పాస్‌తో దాటొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది.  కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై పని చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)