Breaking News

పడిలేచిన కెరటంలా అనిల్‌ అంబానీ..

Published on Thu, 09/26/2024 - 12:40

పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్‌ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.

టాప్‌ టెన్‌ సంపన్నుడు
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్‌ అంబానీ కూడా 2008లో 42 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.

వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్‌ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్‌ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.

కలిసొచ్చిన సెప్టెంబర్
ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.

ఇదీ చదవండి: అనిల్‌ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?

అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.

అనిల్ అంబానీ నెట్‌వర్త్‌
తన నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీల పురోగతితో అనిల్‌ అంబానీ నెట్‌వర్త్‌ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా  2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)