Breaking News

అనిల్‌ అంబానీకి భారీ విజయం

Published on Thu, 08/14/2025 - 19:08

చాలా ఏళ్ల తర్వాత అనిల్‌ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు
‘ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఏమిటీ వివాదం?
రిలయన్స్‌ ఇన్‌ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం,  అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.

ఆర్‌ఇన్‌ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్‌లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్‌ఫ్రా ప్రతిస్పందనను కోరింది.

విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్‌ఇన్‌ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)