Breaking News

ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఆస్తులు సున్నా అంటున్నాడు..

Published on Fri, 04/28/2023 - 11:43

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది.

ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ.

అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి,  రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!)

నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)