Breaking News

చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్‌ షురూ!

Published on Tue, 07/25/2023 - 13:45

ChatGPT for Android users: ఓపెన్‌ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌ జీపీటీ ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్  ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్‌ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి  గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.  బ్రౌజర్ ద్వారా అందుబాటులో  ఉన్న చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్‌బాట్‌కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది.  Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది.

చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ 
♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి   చాట్‌జీపీటీ  అని సెర్చ్ చేయాలి
♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి.
♦  ఒకసారి  యాప్ లాంచ్‌ అయిన తరువాత, ఈ యాప్‌ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది.
♦  అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్  చేయాల్సి ఉంటుంది.

కాగా చాట్‌పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది.  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ ఇంటర్నెట్‌ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది.  ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు  డౌన్‌లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్‌గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)