Breaking News

దిగ్గజ టెలికం కంపెనీలో కలకలం, 73 మిలియన్ల మంది యూజర్ల డేటా లీక్‌

Published on Sun, 03/31/2024 - 20:21

అమెరికాలో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్‌ టీలో కలకలం రేపింది. ఆ సంస్థ యూజర్ల డేటా డార్కెట్‌ వెబ్‌లో ప్రత్యక్షమైంది. రెండు వారాల క్రితం ‘డార్క్వెబ్’ లో విడుదలైన డేటా కారణంగా సుమారు 7.6 మిలియన్ల మంది ప్రస్తుత ఖాతాదారులు, 65.4 మిలియన్ల మాజీ ఖాతాదారులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. 

పలు నివేదికల ప్రకారం.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన ఏటీ అండ్‌ టీ కంపెనీ యూజర్ల డేటా 2019 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ డేటాను ఉపయోగించిన సైబర్‌ నేరస్తులు అనధికారికంగా తమ డేటాను యాక్సిస్‌ చేసిన ఆధారాలు లేవని, అయితే డేటా లీకేజీ సంస్థ నుంచి వచ్చిందా లేదంటే సిబ్బంది వల్లే ఇలా జరిగిందా? అన్న అంశంపై ఏటీ అండ్ టీ విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది.  

పాస్‌వర్డ్‌లు రీసెట్‌
ఈ ఘటన తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డేటా లీకేజీ అందుకు గల కారణాల్ని అంచనా వేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత యూజర్లతో ఏటీ అండ్‌ టీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత 7.6 మిలియన్‌ యూజర్ల పాస్ వర్డ్‌లను రీసెట్ చేసింది. అవసరమైన చోట క్రెడిట్ మానిటరింగ్ అందిస్తామని తెలిపింది. కాగా, 5జీ నెట్‌వర్క్‌ యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 290 మిలియన్ల ప్రజలకు సేవల్ని అందిస్తోంది.

ఫిబ్రవరిలో అంతరాయం
ఫిబ్రవరిలో ఎటి అండ్ టిలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది యుఎస్ వినియోగదారులు కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడంలో అంతరాయం కలిగింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)