Breaking News

బిర్లా పుట్టినరోజు.. రేర్‌ ఫొటోతో కూతురి ఆసక్తికర పోస్ట్‌

Published on Thu, 06/15/2023 - 17:55

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పుట్టినరోజు (జూన్ 14) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అనన్య బిర్లా రేర్‌ ఫొటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి ఒక త్రోబ్యాక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పాపాయిగా ఉన్న అనన్యను బిర్లా ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను ఆమె షేర్‌ చేశారు.

“పుట్టినరోజు శుభాకాంక్షలు పా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫొటోను పోస్ట్‌ చేశారు. వీటికి వేలాదిగా లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా బిర్లాకు పుట్టినరోరజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్, విజె అనూషా దండేకర్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు..

వాణిజ్యం, పరిశ్రమల రంగానికి చేసిన కృషికి గాను కుమార మంగళం బిర్లాకు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో సహా అన్ని ప్రధాన గ్రూప్ కంపెనీల బోర్డులకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. కుమార మంగళం బిర్లా ముగ్గురు సంతానంలో అనన్య బిర్లా పెద్దది. ఆమెతోపాటు బిర్లాకు కుమారుడు  ఆర్యమాన్ మరో కుమార్తె అద్వైతేషా కూడా ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)