Breaking News

కాస్మెటిక్స్‌ విభాగంలోకి అనన్య బిర్లా

Published on Sat, 02/08/2025 - 06:31

ముంబై: వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా (30) తాజాగా సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్‌ విభాగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త వెంచర్‌ ద్వారా పలు బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ బ్రాండ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారులు, దేశీ బ్రాండ్ల నుంచి మరింతగా ఆశిస్తున్నట్లు అనన్య ఒక ప్రకటనలో తెలిపారు. 

వారి ఆకాంక్షలను తీర్చే విధంగా తమ ఉత్పత్తుల శ్రేణి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, వెంచర్‌ పేరు, పెట్టుబడి ప్రణాళికలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఏటా 10–11 శాతం వృద్ధి చెందుతున్న పర్సనల్‌ కేర్‌ మార్కెట్‌ 2028 నాటికి 34 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులోనే అనన్య బిర్లా సూక్ష్మ రుణాల సంస్థ స్వతంత్ర మైక్రోఫిన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశీయంగా రెండో అతి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐగా కార్యకలాపాలు సాగిస్తోంది. గాయని, పాటల రచయిత కూడా అయిన అనన్య.. 62 బిలియన్‌ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్‌ బోర్డులో డైరెక్టరుగా  ఉన్నారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)