అనంత్‌ అంబానీకి అరుదైన అవార్డ్‌

Published on Tue, 12/09/2025 - 12:40

వ్యాపారవేత్త అనంత్‌ అంబానీ అరుదైన అవార్డు అందుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణలో అనూహ్య ప్రభావం చూపినందుకు అమెరికన్ హ్యూమేన్ సొసైటీ అంతర్జాతీయ విభాగమైన గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ.. అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా, అలాగే అతి పిన్న వయస్కుడిగా అంబానీ చరిత్ర సృష్టించారు.

అంబానీ స్థాపించిన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంవంతారా విజ్ఞాన ఆధారిత సంరక్షణా కార్యక్రమాలు, పెద్ద స్థాయిలో రక్షణపునరావాస చర్యలు, అలాగే జాతి సంరక్షణలో కొత్త దారులు చూపినందుకు విశేషంగా ప్రశంసలు అందుకుంది. గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ అధ్యక్షురాలు, సీఈవో డాక్టర్ రాబిన్ గాంజర్ట్ మాట్లాడుతూ, “ప్రతి ప్రాణికి గౌరవం, ఆరోగ్యం, ఆశ ఇవ్వాలన్న అంకితభావాన్ని వంతారా ప్రతిబింబిస్తోంది. దీనికి దార్శనికుడు అనంత్ అంబానీ,” అని పేర్కొన్నారు. వంతారాను ఆమె “చికిత్స, పునరుజ్జీవనానికి నిలయంగా నిలిచిన విశిష్ట సంరక్షణ కేంద్రం”గా అభివర్ణించారు.

ఈ గౌరవం అందుకున్న అనంత్ అంబానీసర్వభూతహిత భావాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి ప్రాణికి గౌరవం, శ్రద్ధ, భరోసా ఇవ్వడం మా ధర్మం. సంరక్షణ రేపటికి వాయిదా వేయదగినది కాదు” అని అన్నారు. గతంలో ఈ అవార్డును బెట్టి వైట్, షిర్లీ మెక్‌లేన్, జాన్ వేన్ వంటి ప్రముఖులు, అలాగే అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్. కెన్నెడీ, బిల్ క్లింటన్ అందుకున్నారు.

కఠినమైన గ్లోబల్ హ్యూమేన్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వంతారా, జంతు ఆహారం, ప్రవర్తనా సంరక్షణ, వైద్య సేవలు, సహజ ప్రవర్తనకు అవకాశాలు వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు చూపింది. వంతారా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న జాతుల పునరుద్ధరణ, శాస్త్రీయ సంరక్షణ పరిశోధనలు, ప్రకృతి వాతావరణాల్లో జంతువుల పునర్నివాసంపై దృష్టి సారిస్తున్నాయి.

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)