Breaking News

అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..

Published on Sat, 04/26/2025 - 15:05

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం తన కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ'ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.

అనంత్ అంబానీ.. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనంత్ అంబానీ.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఇప్పటికే అనంత్ పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనంత్ వేతనం.. ఏడాదికి రూ.4.2 కోట్లు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్​గా నియామకమవ్వడంతో ఆయన వేతనం అంతే ఉంటుందా? పెరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అనంత్ అంబానీ, జంతు సంక్షేమం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం.. వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..

ఆకాష్ అంబానీ గ్రూప్ టెలికాం అండ్ డిజిటల్ సేవల విభాగం అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇషా అంబానీ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఆకాశ్‌, ఇషా అంబానీలు కూడా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)