Breaking News

ఫార్ములా ఇ రేసింగ్‌పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌,కేటీఆర్‌ స్పందన

Published on Fri, 02/03/2023 - 15:31

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనున్నాయి.  ఫిబ్రవరి 11వ తేదీ నుంచి  ప్రారంభంకానున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి 12, న FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ద ద్వారా  హైదరాబాద్ చరిత్ర సృష్టించోబోతోంది.

దీనిపై పారిశశ్రామిక వేత్త ఆనంద్‌మహీంద్ర ట్విటర్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా  ట్వీట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత,  దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో  రేసింగ్‌ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.  అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్‌కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌  కూడా  ఆనంద్‌ మహీంద్రకు ధన్య వాదాలు తెలిపారు. 

మాతృ సంస్థలో మహీంద్రా ఎలక్ట్రిక్‌ 
ఎలక్ట్రిక్‌ వాహన విభాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తమలో విలీనమైందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం లభించిందని వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి విలీనం చేసినట్టు మహీంద్రా స్పష్టం చేసింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)