Breaking News

కొత్త సంవత్సరంలో తొలి అడుగులు

Published on Fri, 01/03/2025 - 12:10

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్‌(X.com) ఖాతాలో షేర్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.

ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్‌ నోటీసులు

ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)