Breaking News

మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..

Published on Thu, 09/19/2024 - 17:50

'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.

బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్‌ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్‌ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా

న్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)