అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!
Published on Mon, 01/22/2024 - 14:42
అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఉన్నారు.
భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ వెంబు కుటుంబంతోపాటు ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఒక రోజు ముందే అయోధ్యకు చేరుకున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సుమారు 500 మంది స్టేట్ గెస్ట్స్ లిస్ట్లో శ్రీధర్ వెంబు కూడా ఉన్నారు. తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్న ఆయన తమకు కలిగిన భక్తి పారవశ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
తన అమ్మ జానకి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్నానని ‘ఎక్స్’(ట్విటర్)లో శ్రీధర్ వెంబు తెలియజేశారు. ‘అమ్మ శ్రీరామునికి జీవితాంతం భక్తురాలు. అయోధ్యను దర్శించడం గొప్ప అదృష్టం. జై శ్రీరామ్’ అని పేర్కొంటూ తల్లి, కుటుంబ సభ్యులతో అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు.
In Ayodhya with my amma Janaki and my brother Kumar and his wife Anu.
— Sridhar Vembu (@svembu) January 21, 2024
Amma is a life-long devotee of Lord Shri Ram. Very blessed to be here.
Jai Shri Ram 🙏🙏🙏 pic.twitter.com/gwFIE8mZJb
Tags : 1