Breaking News

ఒక్క ప్లాట్ రూ.200 కోట్లు.. భారీగా ఎగబడ్డ జనం - ఎందుకో తెలుసా?

Published on Mon, 02/05/2024 - 16:40

కరోనా మహమ్మారి తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. గత కొంతకాలం నుంచి ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇండియాలోనే ఇలా ఉంటే.. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల USAలో ప్లాట్ ఏకంగా రూ.200 కోట్లకు పలికినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలోని చాలామంది ధనవంతులు ప్లోరిడాలోని మయామీ బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఇటీవల అక్కడ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఎగబడ్డారు. దీంతో అది 23.9 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.200 కోట్లకంటే ఎక్కువ.

నిజానికి రూ.200 కోట్లకు పలికిన ఆ స్థలంలో ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ 'ఏఐ క్యాప్‌వన్' నివసించాడు, అతడు చనిపోయిన తరువాత అతని భవనం నేలమట్టం చేసారు. ఆ స్థలానికి అంత రేటు పలకడానికి కారణం అక్కడ గ్యాంగ్‌స్టర్ నివాసముండటమే అని కొందరు భావిస్తున్నారు. ఈ స్థలం మొత్తం 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం.

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అక్కడ నివాసముండటం వల్ల ఆ స్థలం బాగా పాపులర్ అయింది. దీంతో ఆ స్థలం గురించి చాలామందికి తెలిసింది. అందులోనూ అది పూర్తిగా ఖాళీ స్థలం కావడం వల్ల ఎక్కువమంది తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చని ఎగబడ్డారు. 2021లో ఈ స్థలం విలువ 10.75 మిలియన్లని.. ఆ తరువాత ఇప్పుడు ఆ భూమి విలువ రెట్టింపు ధరకు పలికినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్‌ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)