Breaking News

కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?

Published on Wed, 10/23/2024 - 15:53

అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్‌కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్‌కాజిల్' రికార్డ్‌ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.

లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్‌ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్‌ కంప్యూటర్ సర్వీసెస్‌ (తర్వాత జిరాక్స్‌ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్‌ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు.

దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్‌లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్‌ ఈ భవనానికి ఇంటీరియర్‌లను రూపొందించారు.

ఇందులోని ఫర్నిచర్‌ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్‌ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్‌ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్‌, ఫిట్‌నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్‌ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్‌ చెబుతున్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)