IPL 2025: జియోహాట్‌స్టార్‌కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎన్ని కోట్లంటే?

Published on Sun, 03/23/2025 - 08:10

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్‌స్టార్‌ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు
➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు
➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి
➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు
➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకు

స్పాన్సర్లు
జియోహాట్‌స్టార్‌ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్‌పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.

ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్‌ హీరోయిన్‌ కూతురు.. ఎవరో తెలుసా?

జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్స్
ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్‌స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్‌స్క్రైబర్‌ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‌కు 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది.

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)