చిన్నప్పుడు స్కూల్‌లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ

Published on Thu, 06/15/2023 - 14:06

ఈ రోజు యావత్ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి అతని కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు గడిస్తూ దేశంలో అత్యంత సంపన్నులుగా విరాజిల్లుతున్న. అయితే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చదువుకునే రోజుల్లో తాను చదివిన స్కూల్‌లో తోటి స్నేహితులు ఎగతాళి చేసేవారని తెలిసింది. ఇంతకీ అనంత్ అంబానీని ఎందుకు ఎగతాళి చేసేవారు, ఏ కారణంతో ఎగతాళి చేసేవారని మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ.. ఖరీదైన అన్యదేశ్య కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉపయోగించే అనంత్ అంబానీ చిన్నప్పుడు పాకెట్ మనీగా కేవలం రూ. 5 మాత్రమే తీసుకెళ్లేవాడని తెలిసింది. ఇతడు అయితే ముఖేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకునేటప్పుడు క్యాంటీన్‌లో ఖర్చు చేయడానికి ఐదు రూపాయలు తీసుకెళ్తే తోటి విద్యార్థులంతా 'తూ అంబానీ హై యా భికారీ' అని ఎగతాళి చేసేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొడుకు చెప్పిన మాటలకు నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు.

(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!)

భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ వినయ ప్రవర్తన, మంచి సంప్రదాయాలను నేర్చుకున్నారు. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి ప్రస్తుతం అనేక రిలయన్స్ వెంచర్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతడు త్వరలోనే రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఇతని నికర ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని సమాచారం.

Videos

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)