Breaking News

రూ.2000 నోటు: అమెజాన్‌ షాకింగ్‌ అప్‌డేట్‌, తెలుసుకోండి!

Published on Thu, 09/14/2023 - 09:47

Rs. 2000 Note Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్  తన యూజర్లకు చేదువార్త అందించింది. రెండు వేల నోటుకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ  (COD) సేవలపై  2000 నోట్లను అంగీకరించడాన్ని  ఇకపై నిలిపివేయనుంది.  సెప్టెంబర్ 19 నుండి 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.   అయితే, ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే,  వీటిని అంగీకరిస్తున్నట్టు  వెల్లడించింది.   (ఉద్యోగులకు షాక్‌: గూగుల్‌లో మళ్లీ తొలగింపుల పర్వం)

ఆర్‌బీఐ 2000 కరెన్సీ నోట్లును చలామణినుంచి ఉపసంహరించుకున్న తర్వాత క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవకు  అంగీకరించింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు సమీపిస్తున్న తరుణంలో అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటి వద్ద నుంచే రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కూడా అమెజాన్‌ కల్పించిన సంగతి తెలిసిందే.

కాగా 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాటిని చెలామణి నుండి తొలగించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా  రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న  రూ.2000 నోట్లలో 50శాతం  బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు  ఆర్‌బీఐ పేర్కొంది.  2.72 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు  అందాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 25 న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్‌బీఐ  లెక్కల ప్రకారం , చెలామణిలో ఉన్న  రూ. 2,000 కరెన్సీ నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి లేదా మార్పిడి అయ్యాయి.

Videos

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్