Breaking News

అమెజాన్‌ కొత్త పాలసీ.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో!, ఆందోళనలో ఉద్యోగులు

Published on Sat, 07/22/2023 - 16:31

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ  అమెజాన్‌ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు చూసి చూడనట్లుగా ఉన్న ఈకామర్స్‌ దిగ్గజం ఇటీవల ఉద్యోగుల పని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో  నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం.. గత ఏడాది నుంచి సంస్థ ఉద్యోగుల్ని తొలగించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు కార్యలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇ‍వ్వలేదు. బహుశా! కోవిడ్‌-19 నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి పరిమితమైన ఉద్యోగులే ఆఫీస్‌కు రావాల్సి ఉంటుందని సమాచారం. 

ఈ సందర్భంగా అమెజాన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యలయాల నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు సహచర ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టే ఉద్యోగులు ఆఫీసుల్లో ఇతర ఉద్యోగులకు కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీంతో సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు. 

అమెజాన్‌లో తొలగింపులు 
అయినప్పటికీ, అమెజాన్‌లో ఉద్యోగులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.  ఈ ఏడాది అమెజాన్‌ 27,000 మందిని ఇంటికి సాగనంపింది.  తన కార్పొరేట్ వర్క్‌ ఫోర్స్‌లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరింది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్‌లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే దేశీయ టెక్‌ కంపెనీలు సైతం 
మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్‌, విప్రో,హెచ్‌సీఎల్‌లు ఉద్యోగులు ఆఫీస్‌ రావాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వర్క్‌ ఫోర్స్‌ కార్యాలయాలకు రానుందని టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు.

చదవండి : ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో.. ఆందోళనలో భారతీయులు!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)