Breaking News

మరోమారు లేఆఫ్స్: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం

Published on Fri, 01/31/2025 - 07:30

దిగ్గజ టెక్ కంపెనీలన్నీ లాభాల బాటలో దూసుకెళ్తున్న వేళ.. 'అమెజాన్' (Amazon) మరోమారు లేఆఫ్స్ ప్రకటించనుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు.. సంస్థ తన కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రభావం ఎంతమంది ఉద్యోగులపై పడుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

కంపెనీ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడంలో భాగంగానే.. ఈ లేఆప్స్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఉద్యోగుల తొలగింపు కొంత కష్టమైన ప్రక్రియే.. కానీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి, సంస్థ పనితీరును మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్మాణమే తీసుకోవాల్సి వచ్చిందని.. సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ బాధ్యతను పర్యవేక్షిస్తున్న 'డ్రూ హెర్డెనర్' (Drew Herdener) పేర్కొన్నారు.

యాండీ జెస్సీ 2021లో ఆమెజాన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. కంపెనీని పునర్నిర్మించడానికి లేదా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి కావలసిన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే పలువురు ఉద్యోగులను సైతం తొలగించారు. ఇప్పుడు మరోమారు ఈ లేఆప్స్ వార్త తెరమీదకు వచ్చింది.

2022లో కంపెనీ వివిధ విభాగాల్లో 27,000 మందిని తొలగించడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఉద్యోగులందరూ.. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ విధానం తొలగించాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఆఫీస్ బాట పట్టారు.

అమెజాన్‌ పెట్టుబడి రూ.60 వేలకోట్లు
తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ‘అమెజాన్‌ వెబ్‌ సర్విసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ’ వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)