Breaking News

గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్‌కి ఇదే మంచి సమయం

Published on Tue, 06/13/2023 - 13:17

Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్‌కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్‌లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్‌ 14 సిరీస్‌ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

ఐఫోన్ 14 (iPhone 14)
దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్‌ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ  వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus)
యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్  ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. 

(ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో)

ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro)
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్‌లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.

(ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?)

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max)
ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు.
-ఎన్.కుమార్

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)