Breaking News

కనీవినీ ఎరుగని డీల్స్.. ఫెస్టివల్ సేల్స్: ఎప్పుడంటే..

Published on Mon, 09/01/2025 - 18:23

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 'ఫెస్టివల్ సేల్స్' ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తాయి.

అమెజాన్ ఫెస్టివల్ సేల్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది నవరాత్రి & దీపావళి పండుగ సీజన్‌లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎప్పటిలాగానే.. ప్రైమ్ సభ్యులకు సేల్ ప్రారంభమయ్యే 24 గంటల ముందు యాక్సెస్ లభిస్తుంది.

బ్లాక్‌బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, టాప్ 100 డీల్స్ వంటి అనేక రకాల సదుపాయాలను అమెజాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు ఈఎంఐ లావాదేవీలతో సహా ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.

ఇదీ చదవండి: ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్‌టైమ్‌ రికార్డ్

ఇక ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, కెమెరాలు మొదలైనవాటి మీద.. అద్భుతమైన డిస్కౌంట్‌లు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ తేదీకి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ సేల్ ప్రారంభమవ్వనికి ముందే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు షాపింగ్ చేయడానికి యాక్సెస్ లభిస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)