Breaking News

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్

Published on Sat, 09/30/2023 - 22:08

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.ఎం. నాయక్ లార్సెన్ & టూబ్రో (L&T) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అధికారికంగా వైదొలిగారు. 23 బిలియన్‌ డాలర్ల వ్యాపార సమ్మేళనం నాయకత్వ బాధ్యతలను ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌కు అందించారు.

81 ఏళ్ల నాయక్ ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటారని, గత కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను మరింత పెంచడంపై దృష్టి సారిస్తారని ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది.

దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు

ఎ.ఎం. నాయక్‌ పారిశ్రామిక, దాతృత్వ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇండియన్‌ పోస్ట్ సంస్థ ఈ సందర్భంగా ఆయనపై ఒక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది.  త్వరలో ప్రచురితం కానున్న ఎ.ఎం.నాయక్‌ జీవిత చరిత్ర పుస్తకం ‘ది మ్యాన్ హూ బిల్ట్ టుమారో’ ముఖచిత్రాన్ని ఎల్‌ అండ్‌ టీ మాజీ డైరెక్టర్లు, నాయక్ కుటుంబ సభ్యులు 
ఆవిష్కరించారు.

నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ పేరుతో అణగారిన వర్గాల విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి ఎ.ఎం.నాయక్‌ కృషి చేస్తున్నారు. అలాగే నిరాలీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ద్వారా రాయితీ ధరకు సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను పేదలకు అందిస్తన్నారు.

గుజరాత్‌లో ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన నాయక్, 1965లో ఎల్‌అండ్‌టీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆరు దశాబ్దాలు ఆ సంస్థలో పనిచేసిన ఆయన 1999లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, 2003లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు.  కంపెనీ బోర్డు ఆయనకు ఛైర్మన్ ఎమిరిటస్ హోదాను సైతం ప్రదానం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)