పోర్ట్ ఆఫ్ రోటర్‌డామ్‌తో ఏఎం గ్రీన్ ఒప్పందం

Published on Mon, 05/26/2025 - 13:20

హైదరాబాద్: భారత్‌, ఐరోపా మధ్య గ్రీన్ ఎనర్జీ సరఫరా గొలుసు నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏఎం గ్రీన్, పోర్ట్ ఆఫ్ రోటర్‌డామ్ అథారిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్రీన్ ఇంధనాల బంకరింగ్, సస్టైనబుల్ ఏవియేషన్ ఇంధనాల (SAF) సరఫరా, రోటర్‌డామ్‌లో టెర్మినల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ఒప్పందం  ప్రధాన లక్ష్యం.

సంవత్సరానికి 10 లక్షల టన్నుల గ్రీన్ ఇంధనాల ఎగుమతి, సుమారు 1 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధ్యం చేసే ఈ సహకారం, భారతదేశ నెట్ జీరో లక్ష్యాలు, ఐరోపా డీకార్బనైజేషన్ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఏఎం గ్రీన్ 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం, 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. కాకినాడలో తొలి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

రోటర్‌డామ్ పోర్ట్, ఐరోపాలో 13శాతం ఇంధన డిమాండ్‌ను నిర్వహిస్తూ, హైడ్రోజన్ హబ్‌గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగస్వామ్యం గ్లోబల్ కార్బన్-రహిత శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఏఎం గ్రీన్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలసెట్టి, రోటర్‌డామ్ సీఈఓ బౌడెవిజన్ సీమన్స్ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)