Breaking News

గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్ట్‌లో భారీ ఆర్డర్‌

Published on Wed, 10/30/2024 - 20:39

దేశంలో అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్‌ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్‌ ఆర్డర్.

‌1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను  ఉత్పత్తి చేసి గ్రీన్‌ అమ్మోనియాగా మారుస్తారు.

ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్‌లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ  గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ  640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్‌లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది.  

ఏఎం గ్రీన్‌ గురించి.. 
హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)