Breaking News

కేవీపీ పెట్టుబడి డబుల్‌ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు! 

Published on Mon, 05/29/2023 - 13:27

సాక్షి, ముంబై:  తమ పెట్టుబడికి గరిష్ట ఆదాయం రావాలని ప్రతి పెట్టుబడిదారుడు కోరుకుంటాడు. అలాంటి వారికోసం పోస్టాఫీస్‌ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పదేళ్ల లోపే అంటే.. తొమ్మిదేళ్ల ఏడు నెలల వ్యవధిలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభించే పథకం కిసాన్‌ వికాస పత్ర.

మార్కెట్లో  పెట్టుబడికి విభిన్న అప్షన్స్‌ ఉన్నాయి. అయితే  రిస్క్‌లేని, సాధారణ ప్రజలకు  మొగ్గు చూపుతారు. అలాంటి  పోస్ట్ ఆఫీస్  స్కీం గురించి తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర  లేదా కేవీపీ. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో, పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని పెట్టుబడి పెడితే,  నిర్ణీయ కాల వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు.

పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర
♦ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ పథకం కిసాన్ వికాస్ పత్ర  ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రారంభించినా   తరువాత, ఎవరైనా సాధారణ వ్యక్తి ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయవచ్చు. 
♦  ఏప్రిల్ 1, 2023న  అమల్లోకి వచ్చిన వడ్డీరేట్ల ప్రకారం 7.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అంతేకాదు కిసాన్ వికాస్ పత్ర పథకం కింద డిపాజిట్ల రెట్టింపు కాలపరిమితిని కూడా తగ్గించింది. గతంలోని 120 నెలలతో పోలిస్తే కేవలం 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది.
♦  ఇందులో కనిష్టంగా రూ. 1,000 నుంచి, గరిష్టంగా ఎంతైనా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇదీ చదవండి: రూ.2 వేల నోటు: జూన్‌ బ్యాంకు హాలిడేస్‌ లిస్ట్‌ చూస్తే షాకవుతారు!

కిసాన్ వికాస్ పత్ర: అర్హతలు
♦ కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు  సమీపంలోని పోస్టాఫీసులో  కొనుగోలు చేయవచ్చు. 
♦ మైనర్లు,  మానసిక అనారోగ్యంతో ఉన్న వారి తరపున పెద్దవారు దరఖాస్తును సమర్పించవచ్చు.
♦ ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) హిందూ అవిభక్త కుటుంబాలు ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు. 
​​​​​​​♦ ఈ పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెడితే  రూ. 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు. 

పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో ఎలా పెట్టుబడి పెట్టాలి?
​​​​​​​♦ దగ్గరలోని పోస్టాఫీసులో కేవీపీదరఖాస్తు ఫారమ్-Aని   నింపాలి.  
​​​​​​​♦ గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాని కాపీని అందించాలి.
​​​​​​​♦ ​​​​​​​పత్రాలను పరిశీలించి, అవసరమైన డిపాజిట్‌ చేసిన అనంతరం కేవీపీ సర్టిఫికేట్  తీసుకోవచ్చు.\

మరిన్ని ఆసక్తికర విషయాలు, కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)