Breaking News

ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్‌! ఇక దూకుడే..

Published on Wed, 09/06/2023 - 19:49

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్‌ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్‌, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు అలియాభట్‌. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

‘బూట్‌స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్‌ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు.

(తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!)

ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్‌. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్‌ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్‌లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)