Breaking News

గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..

Published on Wed, 02/26/2025 - 08:12

రోజువారీ ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్నారా..? ఇకపై మీ సమస్యకు చెక్‌ పెట్టేలా గాల్లో ఎగిరే కార్లు వస్తున్నాయి. అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ సినిమాల్లో మాదిరి గాల్లో ఎగిరే కారును తయారు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ స్టార్టప్ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ‘మోడల్ ఏ’ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ వినూత్న వాహనాన్ని రోడ్లపై కూడా డ్రైవ్ చేసేలా తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది గాల్లో నిలువుగా టేకాఫ్‌ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

సాధారణంగా ఎగిరే కార్లంటే డ్రోన్ల మాదిరి బయటకు కనిపించేలా బారీ ప్రొపెల్లర్లును కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ‘మోడల్ ఏ’ కారు ఇన్‌బిల్ట్‌గా ఉన్న రోటర్ బ్లేడ్లతో సాంప్రదాయ ఆటోమోటివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఆ డిజైన్‌తోనే నేలపై నుంచి ఎగిరే సామర్థ్యం దీని సొంతం. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఛార్జ్‌ చేస్తే రోడ్లపై 320 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని, గాల్లో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

ఇదీ  చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!

అలెఫ్ ఏరోనాటిక్స్ ఫ్లైయింగ్ కారుతో ట్రాఫిక్‌ రద్దీ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాహనం నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్ సామర్థ్యాలు కలిగి ఉండడంతో రన్‌వేల అవసరం ఉండదు. ఇది పట్టణ వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు. కంపెనీ ‘మోడల్ ఏ’ కోసం 3,300 కంటే ఎక్కువ ప్రీఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. ఇది సుమారు 3,00,000 డాలర్ల (రూ.2.5 కోట్లు) ధర ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరిలో దీన్ని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ చెప్పింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)