Breaking News

ఆకాశ ఎయిర్‌.. ఇక అంతర్జాతీయ సర్వీసులు

Published on Thu, 10/19/2023 - 07:42

న్యూఢిల్లీ: రియాద్, జెడ్డా, దోహా, కువైట్‌కు సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ట్రాఫిక్‌ అనుమతులు లభించినట్టు ఆకాశ ఎయిర్‌ సీఈవో వినయ్‌ దూబే వెల్లడించారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే దశగా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు తీసుకుని, త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలకు ఈ ఏడాది ఆగస్ట్‌తో ఏడాది ముగిసింది. సంస్థ నిర్వహణలోని బోయింగ్‌ 738 మ్యాక్స్‌ విమానాల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి.

ఈ ఏడాది చివరికి మరో రెండు విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. బలమైన ఆర్థిక మూలాలతో, వృద్ధి దశలో ఉన్నట్టు దూబే తెలిపారు. సంస్థ వద్ద నగదు నిల్వలు తగినన్ని ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మూడంకెల స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్‌ చేయనున్నట్టు చెప్పారు. తొలి అంతర్జాతీయ సర్వీసు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడే చెప్పడం కష్టమని దూబే పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకాశ ఎయిర్‌ వారానికి 700 సర్వీసులను, 16 పట్టణాలకు నిర్వహిస్తోంది. దేశీ మార్కెట్‌లో 4.2 శాతం వాటా కలిగి ఉంది.  

నిధుల సమస్య లేదు 
ఆకాశ ఎయిర్‌ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న వార్తలను ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని వినయ్‌ దూబే బదులిచ్చారు. సానుకూల నగదు ప్రవాహాలు ఉన్నాయని, మా నిల్వలను పెంచుకుంటూనే ఉంటామన్నారు. కొత్త విమానాలు ఆర్డర్‌ చేసేందుకు తమకు నిధుల అవసరం లేదన్నారు. జున్‌జున్‌వాలా కుటుంబం సంస్థను వీడుతున్నట్టు వచ్చిన వార్తలు అసంబద్ధమని స్పష్టం చేశారు. తాము దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసినట్టు వారు స్పష్టం చేశారని తెలిపారు. పైలట్ల ఆకస్మిక రాజీనామా, వారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించగా, అది ముగిసిపోయిందంటూ.. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్నట్టు చెప్పారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)