Breaking News

ఇండియాకు కేఎఫ్‌సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!

Published on Sun, 05/07/2023 - 11:14

యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు. 

2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు.

(ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో)

భారతదేశానికి కేఎఫ్‌సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్‌లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం.

(ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!)

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)